పంజాబ్‌లో కరోనాతో ఏసీపీ మృతి

పంజాబ్‌లోని లుథియానాలో కరోనా వైరస్‌తో ఓ పోలీసు అధికారి మృతిచెందారు. కరోనా చికిత్స పొందుతూ ఏసీపీ అనిల్‌ కుమార్‌ కోహ్లీ(52) శనివారం ప్రాణాలు కోల్పోయారు. దీంతో పంజాబ్‌లో కోవిడ్‌-19 బారిన పడి మరణించిన వారి సంఖ్య 16కు చేరింది. ఏప్రిల్‌ 13న ఏసీపీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సద్గురు ప్రతాప్‌ సింగ్‌ ఆస్పత్రిలో చేరారు.  ప్లాస్మా థెరపీతో  చికిత్స  చేయాలని భావించినప్పటికీ అతని  శరీరంలోని ఇతర భాగాలు చెడిపోవడంతోనే అతడు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఏసీపీ కోహ్లీ భార్యకు కూడా కరోనా సోకడంతో ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.