గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ చెట్ల గురించి బుధవారం ట్విట్టర్‌లో పోస్ట్‌చేసిన వీడియో క్లిప్పింగ్ ఆద్యంతం ఆలోచింపజేస్తున్నది. నీడనివ్వడమే కాదు, పక్కనున్న చెట్లకు కష్టకాలంలో సహకారమందించే గొప్పగుణం కూడా వాటికి ఉంటుందని తెలియజేసేలా ఒక నిమిషం 46 సెకండ్ల నిడివితో ఉన్న వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నది. ‘చెట్లు పైకి మౌనంగానే కనిపిస్తాయి కానీ, అవి సమాచారాన్ని పరస్పరం చెరవేసుకొనే గొప్ప కమ్యూనికేటర్లు’ అని సంతోష్‌కుమార్ అభివర్ణించారు. కరువు కాటకాలు, ప్రకృతి విపత్తులకు సంబం ధించిన సమాచారాన్ని వేర్ల ద్వారా ఒకదాని నుంచి మరో వృక్షానికి చేరవేసుకుంటాయ ని వివరించారు. పక్కపక్కన ఉన్న చెట్లు ఎలా పరస్పరం సహకరించుకుటాయో వివరించే ఈ వీడియో అందరి దృష్టి ని ఆకర్షిస్తున్నది.
చెట్లు గొప్ప కమ్యూనికేటర్లు