పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు విచ్చేసిన రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తున్నారు. ప్రభుత్వం రేపు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 45 బిల్లులను ఉభయసభల ముందుకు తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇప్పటికే గురువారం అఖిలపక్ష సమాశం ఏర్పాటు చేశారు. మరోవైపు రేపు ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఏప్రిల్ ౩వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం